ETV Bharat / international

'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'

author img

By

Published : Apr 30, 2020, 6:35 AM IST

Updated : Apr 30, 2020, 8:16 AM IST

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. అయినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు బొల్సొనారో వైఖరిలో మార్పురావడం లేదు. తాజాగా బ్రెజిల్​లో మరణాల సంఖ్య చైనాను దాటింది. దీనిపై ప్రశ్నించగా.. 'నేనేమీ అద్భుతాలు చేయలేను' అంటూ సమాధానిమిచ్చి మరోమారు వార్తల్లో నిలిచారు అధ్యక్షుడు.

Brazil prez says, he doesn't do miracles as virus burials surge
'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'

కరోనాను ఎదుర్కొంటున్న తీరుతో బ్రెజిల్​ అధ్యక్షుడు బొల్సొనారో చర్చనీయాంశమయ్యారు. తాజాగా దేశంలోని కరోనా మరణాలపై స్పందించిన తీరుతో మరోమారు వార్తల్లో నిలిచారు బొల్సొనారో.

బ్రెజిల్​లో వైరస్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 71వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. తాజాగా మరణాల సంఖ్య(5,017) చైనాను దాటింది. దీనిపై ప్రశ్నించగా.. తానేమీ అద్భుతాలు చేయలేనని జవాబిచ్చారు అధ్యక్షుడు.

"మరణాల సంఖ్య పెరిగితే నన్నేం చేయమంటారు? నేనేనీ అద్భుతాలు చేయలేను."

--- బొల్సొనారో, బ్రెజిల్​ అధ్యక్షుడు.

కరోనా​తో ప్రపంచ దేశాలు బెంబేలెత్తుతుంటే... వైరస్​ను చిన్న ఫ్లూగా అభివర్ణించి అనేకమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు బొల్సొనారో.

మరోవైపు బ్రెజిల్​లోని మనౌస్​ నగరం వైరస్​కు కేంద్ర బిందువుగా మారింది. మృతదేహాలకు ఖననం చేసేందుకు పబ్లిక్​ సిమెంటరీ(శ్మశానవాటిక)ను తెరవాల్సి వచ్చింది. రాత్రి పూట కూడా ఇది పనిచేస్తోంది.

Last Updated : Apr 30, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.