గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఉన్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. దళిత బాలికకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు అంగడి నాగరాజు, జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్, దళిత గిరిజన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామ చంద్రయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'