త్వరలో ఎన్నికలు జరగబోయే గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముసాయిదా తయారీకి రేపటి నుంచి మార్చి 6 వరకు సర్వే నిర్వహించనున్నారు. మార్చి 7, 8 తేదీల్లో పునర్విభజన ప్రతిపాదనలకు నోటీసు జారీ చేస్తారు.
వార్డుల విభజనపై మార్చి 9 నుంచి 15 వరకు అభిప్రాయాలు స్వీకరిస్తారు. ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కూడా సలహాలు స్వీకరించి.. మార్చి 21 వరకు సలహాలు, అభిప్రాయాలపై చర్చిస్తారు. మార్చి 22న పురపాలకశాఖ సంచాలకులకు నివేదిక ఇస్తారు. మార్చి 23, 24 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం.. మార్చి 25న వార్డుల పునర్విభజన తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచే మేడారం చిన జాతర.. తరలొస్తున్న భక్తులు