ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. యాత్రలో భాగంగా హన్మకొండలోని సమ్మయ్య నగర్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ రాని వారికి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. వరంగల్ అభివృద్ధికి ప్రతి నెల రూ.70 కోట్ల నిధులు విడుదల చేస్తున్నారని వెల్లడించారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు.