వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల రైతులు, ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేవాదుల ఎత్తిపోతల భూగర్భ పైపులైన్ల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ను గోదావరి నీటితో నింపినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
కేసీఆర్ పాలనలో తామెన్నడూ చూడనంత స్థాయిలో గ్రామంలోని చెరువులు నిండుకున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరు సమృద్ధిగా ఉండటం వల్ల బీడు భూములు పంట పొలాలుగా మారనున్నట్లు వారు తెలిపారు. పెద్దపెండ్యాల, షోడాషపల్లితో పాటుగా చుట్టూ పక్కల గ్రామాల రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.