మొదట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేకపోయినా.. అనంతరం ఒక్కసారిగా వెలుగుచూసిన కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అనతికాలంలోనే రెట్టింపయ్యాయి. తొలుత కేసులే లేని జిల్లాగా గుర్తింపు పొందిన వరంగల్ గ్రామీణ జిల్లాలోనూ వైరస్ విజృంభించింది. ఉమ్మడి జిల్లాల్లో .. 12,976 మంది కరోనా బారిన పడి.. వరంగల్ అర్బన్ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 వేల మంది కొవిడ్ బారినపడ్డారు. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజల సహకారంతో అదుపులోకి తీసుకువచ్చారు.
ములుగు | వరంగల్ రూరల్ | మహబూబాబాద్ | భూపాలపల్లి | జనగామ | వరంగల్ అర్బన్ | |
మొత్తం పరీక్షలు | 64,796 | 92,699 | 1,94,000 | 37,870 | 1,14,659 | 3,56,025 |
పాజిటివ్ | 5,096 | 6,462 | 12,633 | 3670 | 4689 | 12,976 |
యాక్టివ్ కేసులు | 215 | 203 | 195 | 53 | 119 | 358 |
ఆసుపత్రిలో చికిత్స | 05 | 23 | 02 | -- | 20 | 38 |
హోం ఐసొలేషన్ | 210 | 180 | 193 | 53 | 99 | 320 |
ర్యాపిడ్ యాంటిజెన్ | 53,715 | 83,618 | 1,82,800 | -- | 1,10,773 | 3,44,575 |
ఆర్ట్పీసీఆర్ | 11,081 | 9,081 | 11,200 | -- | 3,886 | 11,450 |
మరణాలు | 12 | 48 | 70 | 12 | 22 | 96 |
ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ నిబంధనలే శరణ్యమని చెబుతున్నారు.
ఇవీచూడండి: రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు