వరంగల్ మహా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మేయర్ గుండా ప్రకాష్ తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌లో వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వ సభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. నగరంలో చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టామని మేయర్ తెలిపారు. వరంగల్‌కి ప్రభుత్వం భారీ నిధులు ఇస్తుందని... వాటిని సక్రమంగా ఉపయోగించుకొని అందరి సమన్వయంతో అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ఈ సమావేశానికి వరంగల్ నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. నగరంలో త్వరలో చేయబోయే పనులపై చర్చించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. బర్త్‌డేకి పిలిచి అత్యాచారం..