కూడు గూడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వరంగల్ మేయర్ ప్రకాష్‌రావు ముందు వరద బాధితులు బోరుమన్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లతో సహా బియ్యం, సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు మేయర్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వర్షాలకు వరద నీటితో అతలాకుతలమైన భగత్‌సింగ్ వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న వరద బాధితులు తమ కష్టాలను చెప్పుకున్నారు. వరద నీటితో అన్ని కోల్పోపోయామని, తమను ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్య పడకండని, వరద బాధితులకు అండగా ఉంటామని వరంగల్ మేయర్ ప్రకాష్‌రావు భరోసా కల్పించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
ఇవీ చూడండి: నిజామాబాద్ పాలనాధికారిని అప్రమత్తం చేసిన నాందేడ్ కలెక్టర్