దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన వారికి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని నిజాంపూర్, మండి బజార్. చార్బౌలీకి చెందిన నగరవాసులు ఇటీవల దిల్లీకి ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారిని గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి నమూనాలను హైదరాబాద్ పంపించారు.
17 మంది నమూనాల్లో వైరస్ పాజిటివ్ రిపోర్ట్ రావడం జిల్లా పోలీస్ కమిషనర్ రవీందర్‌తో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కాలనీలను సందర్శించి హుటాహుటిన సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారి చేయించారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా మెదిలిన వ్యక్తులను కూడా క్వారంటైన్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం