వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం సరఫరాలకు ఉపయోగించిన ఒక ఆటోను, నలుగురు అమ్మకందారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ దాదాపు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో మద్యం ఎక్కడ నుంచి తీసుకు వచ్చారనే విషయంపై విచారణ జరుపుతున్నామని మడికొండ సీఐ జానీ నర్సింహులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 61 పాజిటివ్ కేసులు