ETV Bharat / state

నేడు వరంగల్​లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించడంతో... వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై భాజపా దృష్టి సారించింది. హైద‌రాబాద్ త‌ర్వాత ఓరుగల్లుకు ప్రాధాన్యత ఉండటం, అక్కడ పాగా వేస్తే ఉత్తర తెలంగాణపైనా పట్టు సాధించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేసేందేకు నేడు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపైనా ఆయన సమీక్షించనున్నారు.

Union Minister Kishan Reddy will visit Warangal today
నేడు వరంగల్​లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
author img

By

Published : Dec 11, 2020, 5:03 AM IST

నేడు వరంగల్​లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి నేడు వరంగల్‌ పట్టణ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వెళ్తునున్న కిషన్‌ రెడ్డి.. తొలుత ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని... దర్శించుకుంటారు. అనంతరం కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హృదయ్‌ పథకం కింద చేపట్టిన భద్రకాళీ బండ్‌, జైన మందిరం పనులను పర్యవేక్షించనున్నారు. ఆనంతరం రైల్వే అధికారులతో సమావేశంతోపాటు... హృదయ్, స్మార్ట్ పథకాల పురోగతిపై అధికారులతో కిషన్‌ రెడ్డి సమీక్షించనున్నారు.

వికసింపచేయడమే లక్ష్యం

అధికారిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీవీఆర్​ గార్డెన్‌లో జరిగే జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో కిషన్‌ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నగరానికి అందుతున్న సాయంపై నేతలకు వివరించి చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే అధికార తెరాస వైఫల్యాలను వివరించి... మెజార్టీ డివిజన్లలో కమలం పార్టీని వికసింపచేయడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు కిషన్‌ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రణాళికబద్దంగా పనిచేస్తే విజయం ఎలా సాధించవచ్చో తెలియచెబుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.

పరామర్శ

వరంగల్‌ పర్యటన అనంతరం నేరుగా నకిరేకల్‌ వెళ్లి నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కిషన్‌ రెడ్డి పరామర్శించనున్నారు.

ఇదీ చూడండి: 'రైతులకు పరిహారం చెల్లింపుపై ఏం చర్యలు తీసుకున్నారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.