వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వంతెనపై నుంచి కారు పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం అర్థరాత్రి సమయంలో హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. కాజీపేట వంతెన పైన కారు అదుపు తప్పింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి.. 20 అడుగుల కిందకి పడింది.
పెద్ద శబ్దం రావడం వల్ల పరిసర ప్రాంతాల్లోని వారు ఉలిక్కిపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానికులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్