వరంగల్ లోక్‌సభ తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలిసి ఎనుమాముల, కొత్తపేట, ఆరేపల్లి, పైడిపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించి దేశంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పసునూరి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ప్రజా సేవకై... ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశా: సాంబయ్య