వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆయన ఆలయంలో 9 రోజుల పాటు జరిగే వినాయక చవితి ఉత్సవాలను ప్రారభించారు. అనంతరం గణనాథుడికి మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు.
ఇదీ చూడండి :మట్టి గణపతి - మహా గణపతి