తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పుర్లో కొప్పురు-హుజురాబాద్ ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 1983లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను కొప్పురు గ్రామానికి చెందిన కమల్ అనే వ్యక్తి 2009లో తహసీల్దార్‌తో కుమ్మక్కై, దొంగ పట్టాలు సృష్టించుకున్నారని మండి పడ్డారు.
ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిపై దళితులకు ఎలాంటి హక్కులు లేవంటూ.. కోర్టు నుంచి నోటీసులు పంపించి సదరు వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన పట్టా పుస్తకాలు తిరిగి ఇప్పించి.. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని దళితులు వేడుకున్నారు.
ఇదీ చూడండి: విషం తాగి హోంగార్డు ఆత్మహత్య.. కేసు నమోదు