దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్‌లో వైద్యులు ఆందోళన చేపట్టారు. ఎంజీఎం కూడలి వద్ద మానవహరం నిర్వహించారు. అనంతరం ఎంజీఎంలో భారీ ర్యాలీ చేశారు. ఉదయాన్నే ఓపీ వైద్యసేవల కోసం వచ్చిన రోగులు వైద్యులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ బంగాలో వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఇవీ చూడండి: నిమ్స్ ఆస్పత్రి వద్ద రోగుల ఇక్కట్లు