ఫిబ్రవరి 5 నుంచి జరిగే మేడారం జాతరను పురస్కరించుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి హైదరాబాద్ నుంచి హన్మకొండకు హెలికాప్టర్ ద్వారా వచ్చిన మంత్రులు.. మధ్యలో రహదారులు పరిశీలించడానికి వాహనాల ద్వారా మేడారానికి బయలుదేరారు. అయితే మధ్యలో చింతగట్టు, అరెపల్లి వద్ద జరుగుతున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించారు. మధ్యలో రెండు చోట్లా పనులు ఆగిపోవడం వల్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో పూర్తి చేసి మేడారానికి ఈ దారి నుంచే వెళ్లేందుకు సౌకర్యం కల్పించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా అరెపల్లి మీదుగా మేడారం చేరుకోవడానికి వీలు ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి: 'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా