ETV Bharat / state

మృతుల కడసారి చూపులకు ప్రత్యేక భవనం - Special building in Warangal district for those who died with Corona

అద్దె ఇళ్లలో ఉండే కుటుంబాల్లో ఎవరైనా మృతిచెందితే వారి కష్టాలు అన్నీ ఇన్నీకావు. మృతదేహాన్ని తీసుకురావద్దని ఇంటి యజమాని ఒప్పుకోరు.అటువంటి సమయంలో వారికి శ్మశానవాటిక స్థలమే అంతిమ నివాసం అవుతోంది. లేదంటే బజారులోనే కడసారి చూపులు దక్కుతున్నాయి. ఇటువంటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆఖరి మజిలీ ఆవాస భవనం నిర్మించేందుకు వరంగల్​ పట్టణ పురపాలక ఛైర్‌పర్సన్‌ గుంటి రజని నడుం కట్టారు. ఈ నెల 24న జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అందుకు అవసరమైన ఆమోదం పొందారు.

Special building in Warangal district for those who died with Corona

author img

By

Published : Jul 29, 2020, 12:01 PM IST

సొంతగూడులేని వారి కష్టాలెన్నో..

విద్యా, వ్యాపార రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతున్న నర్సంపేటలో ఉపాధి కోసం ఎందరో పేద, మధ్య తరగతి ప్రజలు వస్తున్నారు. వీరంతా పట్టణంలో అద్దెకుంటున్నారు. నర్సంపేటలో గతేడాది జరిపిన సర్వేలో 1300 మంది సొంతిల్లు లేని వారున్నట్లు తేలింది. కనీస సౌకర్యాల్లేకున్నా ఇళ్ల యజమానులు అడిగినంత చెల్లించి కిరాయికి ఉండక తప్పని పరిస్థితి. ఈ కుటుంబాల్లో విధి వక్రీకరించి ఎవరైనా కాలం చేస్తే వారికి వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కార ప్రక్రియను సవ్యంగా జరుపుకోలేని పరిస్థితి. వీరి దుస్థితిని గుర్తించిన ఛైర్‌పర్సన్‌ రజని పురపాలక సంఘం నిధులతో ఆఖరి మజిలీ ఆవాస భవన నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుట్టారు. మాదన్నపేట మార్గంలోని హిందూ శ్మశానవాటిక ప్రహరీని ఆనుకొని ఆ భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. భవన నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు చేశారు. అద్దెకు ఉంటున్న కుటుంబీకులు వారి బంధువుల మృతదేహాలను తీసుకొచ్చి ఉంచేందుకు, అక్కడే దశదిన కర్మ తంతును సంప్రదాయబద్ధంగా జరుపుకునేందు కు అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.

నిర్ణీత గడువులోగా నిర్మిస్తాం..

పట్టణంలో సొంతిళ్లు లేని పేదలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఆపదలో వారికి మద్దతుగా ఉండే లక్ష్యంతో ఆఖరి మజిలీ ఆవాస భవనం నిర్మించాలనే నిర్ణయించాను. ఈ భవనాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పురపాలక పాలక మండలి సభ్యుల, అధికారుల సహకారంతో నిర్మిస్తున్నాం. ఇది విజయవంతమైతే ఇలాంటి భవనాలు పట్టణంలో మరో రెండు నిర్మిస్తాం. - గుంటి రజని, ఛైర్‌పర్సన్‌

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.