కరోనా వైరస్‌తో చిన్న, పెద్ద వ్యాపారాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కడా చూసినా భయంభయంగానే ఉంది. కొవిడ్ బారి నుంచి రక్షించుకోవాలంటే శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, వైరస్ నిరోధక రసాయన ద్రావణాలు వాడక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటి డిమాండ్ అమాంతంగా పెరుగుతోంది. దీనితో కొంతమందికి వీటి విక్రయం ఓ వ్యాపారంగానూ మారింది. పట్టణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రహదారి వెంట ఓ విక్రయ కేంద్ర దృశ్యం ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టినట్టు కనిపిస్తుంది.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?