వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి కంటైన్మెంట్ ప్రాంతమైన ఎర్రబెల్లి తండా వాసులు తిరుగుతున్నారు. ఎర్రబెల్లి తండా నుంచి ముల్కనూరు గ్రామానికి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ కిరాణ దుకాణాల్లో సరకులు కొనుగోలు చేస్తున్నారు. నేడు ముల్కనూర్‌లో ఇద్దరు ఎర్రబెల్లి గ్రామస్థులు తిరుగుతున్న సమాచారంతో పోలీసులు వారిని హెచ్చరించి పంపించి వేశారు.
దీంతో ముల్కనూర్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేలేరు మండలం ఎర్రబెల్లి రెడ్‌జోన్ నుంచి బయటకు ఎలా వచ్చారని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోక పోతే భీమదేవరపల్లి మండలం మరో రెడ్ జోన్‌గా మారుతుందని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: రెండింటా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: ఉత్తమ్