ETV Bharat / state

COTTON RECORD PRICE: తెల్లబంగారం క్వింటా @ రూ. 11 వేలకు పైనే - వరంగల్ తాజా వార్తలు

COTTON RECORD PRICE: గత కొద్దిరోజుల నుంచి వరంగల్​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు రికార్డు స్థాయిలో రూ. 11వేలకు పైగా ధర పలికింది. మరికొద్ది రోజులు ఇదే ధరలు కొనసాగాలని రైతులు కోరుకుంటున్నారు.

COTTON RECORD PRICE
రికార్డు స్థాయిలో పత్తిధర
author img

By

Published : Mar 25, 2022, 10:49 AM IST

COTTON RECORD PRICE: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో పత్తి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి నిన్నటి వరకు పదివేల రూపాయలు పలికిన తెల్లబంగారం.. ఈరోజు క్వింటాల్​కు రూ.11,170 ధర పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడంతో పాటు పత్తి గింజలతో పాటు నూలు ధర పెరిగిన కారణంగా మంచి డిమాండ్ ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే నిన్న మొన్నటి వరకు రూ. 48వేలు పలికిన మిర్చి తాజాగా రెండు వేల రూపాయలు తగ్గి రూ. 46వేలకు పరిమితమైంది. అయితే రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరుగుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.