ETV Bharat / state

'ఎంజీఎంలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం' - ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి నాగార్జున స్పష్టం చేశారు. ఆసుపత్రిలో అవసరమైన మాస్క్ లు, చేతి తొడుగులు శానిటైజర్లు ఉన్నాయని తెలిపారు.

'ఎంజీఎంలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం'

author img

By

Published : Sep 3, 2020, 7:28 PM IST

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి నాగార్జున స్పష్టం చేశారు. ఆసుపత్రిలో అవసరమైన మాస్క్ లు, చేతి తొడుగులు శానిటైజర్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యనించారు. నూతనంగా ఆసుపత్రి రూ. 50 లక్షల విలువ చేసే హైఫో నాజిల్ క్యానల్ యంత్రాలు వచ్చినట్లు వివరించారు.

కొవిడ్ రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు ఎంజీఎం ఆసుపత్రిలో 4,733 కొవిడ్ నమూనాలను సేకరించగా.. 1,783 పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి కరోనా బాధితుల కోసం 344 పడకను అందుబాటులోకి తీసుకువచ్చామని 188 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. 152 పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఎంత మంది కొవిడ్ బాధితులు వచ్చిన చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.