కరోనా వల్ల జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
తమకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని హన్మకొండలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యం పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.