ETV Bharat / state

కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ తప్పకుండా మంజూరు చేయాలి: నామ - పార్లమెంట్ 2021

కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీని కేంద్రం తప్పకుండా మంజూరు చేయాలని తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కోరారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పార్లమెంటు చేసిన చట్టంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని వ్యాఖ్యానించారు.

nama nageswara rao on khajipet coach factory at parliament
కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ తప్పకుండా మంజూరు చేయాలి: నామ
author img

By

Published : Mar 15, 2021, 8:22 PM IST

Updated : Mar 15, 2021, 8:43 PM IST

రాష్ట్రానికి కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని... కేంద్రం తప్పకుండా మంజూరు చేయాలని లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన వివిధ రైల్వే లైన్లలపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు.

''రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని రద్దు చేస్తూ ఈ మధ్యనే ఓ లేఖ ఇచ్చారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టం అయిన తర్వాత కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మించాలి. అలా హామీని అమలు చేయకపోతే.. పార్లమెంటు చేసిన చట్టంపై ప్రజల విశ్వాసం కోల్పోతారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని తప్పకుండా తెలంగాణకు మంజూరు చేయాలి.''

-నామ నాగేశ్వరరావు, తెరాస లోక్​సభాపక్ష నేత

భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్​కు తన చిన్న తనం నుంచి డిమాండ్‌ ఉందని నామ తెలిపారు. అయితే సభలో నామ ప్రసంగిస్తున్న సమయంలోనే... ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరిస్తున్న మిథున్‌ రెడ్డి... నామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటంతో... సభలో సందడి నెలకొంది.

ఇదీ చూడండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

Last Updated : Mar 15, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.