ETV Bharat / state

'ఓరుగల్లు మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకుంటాం' - mla vinay bhaskar press conference

వరంగల్​ బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ ధీమా వ్యక్తం చేశారు. నగరం అభివృద్ధికి సీఎం కేసీఆర్​ అనేక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమకారులను తప్పకుండా గుర్తిస్తామని వెల్లడించారు.

mla vinay bhaskar press conference
ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ మీడియా సమావేశం
author img

By

Published : Apr 15, 2021, 7:28 PM IST

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలే తెరాసను గెలిపిస్తాయని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అన్నారు. రానున్న వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయనున్నామని ధీమా వ్యక్తం చేశారు. 66 డివిజన్లకు గాను అన్నింట్లో తెరాస అభ్యర్థులు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. హన్మకొండలో వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేష్‌, జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ రామ్మోహన్​తో కలిసి వినయ్‌ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రత్యేక దృష్టి..

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ సారించి వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి నగరవాసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉద్యమకారులను తప్పకుండా గుర్తిస్తామని చెప్పారు. తెరాసకు ఏ పార్టీ పోటీ కాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రజలను కాపాడుకోవడమే భాజపా ధ్యేయం: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.