ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే - temple
వరంగల్ పట్టణ జిల్లా పెద్దపెండ్యాల గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయ భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరచేలా కృషి చేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పెద్దపెండ్యాల గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి దేవాదాయశాఖ నుండి 12 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. తన నియోజకవర్గంలోని రఘునాథపల్లి, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో పలు దేవాలయాల నిర్మాణాలకు కోటీ 97 లక్షల 50 వేల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఇవీ చూడండి: కారుజోరు: హుజూర్నగర్ తోటలో గులాబీ వికాసం
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరచేలా కృషి చేస్తుందని స్టేషన్ ఘనపూర్ తెరాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పెద్దపెండ్యాల గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛవాలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి దేవాదాయశాఖ నుండి 12 లక్షల రూపాయలతో పాటుగా.... తన నియోజకవర్గంలోని రఘునాథపల్లి, ధర్మసాగర్, వేలేరు మండలాలలో పలు దేవాలయాల నిర్మాణాలకు 1 కోటీ 97 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION Conclusion:9000417593