ETV Bharat / state

ఎప్పుడూ ఒకేలా ఎందుకు - కనుమ రోజున ఈ 'నాటుకోడి రసం' చేయండి - ప్లేట్లు నాకేస్తారు! - NATU KODI RASAM RECIPE

నోరూరించే నాటుకోడి రసం - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ వండుకుంటారు!

Kanuma Special Natu Kodi Rasam Recipe
Kanuma Special Natu Kodi Rasam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 1:49 PM IST

Kanuma Special Natu Kodi Rasam Recipe : మూడు రోజుల పండుగ సంక్రాంతి. చాలా మంది కనుమ రోజు నాన్​వెజ్ తింటారు. ఎప్పటిలాగా చికెన్​, మటన్ కర్రీలే కాకుండా, కూల్​ వెదర్​లో వేడి వేడి అన్నంలో అలా చికెన్ రసం వేసుకుని తింటే ఎలా ఉంటుంది. అందులోనూ నాటు కోడి. చెప్తుంటేనే నోరూరుతుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ కనుమ నాడు మీ ఇంట్లో వాళ్లకి ఇలా 'నాటు కోడి రసం' చేసి పెట్టండి. ఈ కొలతలతో చేశారంటే ప్లేట్లు కడగాల్సిన పనిలేదు! నాకేస్తారంతే!!

నాటుకోడి రసం తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు

రసం పౌడర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు

  • జీల కర్ర - సగం టేబుల్ స్పూన్
  • ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
  • మిరియాలు - ఒక టేబుల్ స్పూన్
  • మెంతులు - 1/4 స్పూన్
  • కందిపప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్

టమాస రసం తీయడానికి కావాల్సిన పదార్థాలు

  • టమాటా - 3 (బాగా పండిన టమాటాలు తీసుకోవాలి)
  • పసుపు - సగం టేబుల్ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • కొత్తి మీర - ఒక కట్ట
  • చింతపండు- 50 గ్రాములు నానబెట్టినది తీసుకోవాలి
  • నీళ్లు - 750 ఎమ్​ఎల్​

రసం తయారు చేయడానికి కావాల్సినవి

  • నాటుకోడి చికెన్ - కేజీ (అందులోంచి 5-6 ముక్కలను రోకలిలో వేసి కాస్త దంచుకుని పెట్టుకోవాలి)
  • నూనె - ఒక టేబుల్ స్పూన్
  • వెల్లులి-20 రెబ్బలు
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర - ఒక కట్ట

తాలింపునకు పదార్థాలు

  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు - 20 ఆకులు
  • ఎండుమిర్చి - 2
  • జిలకర్ర - సగం టేబుల్ స్పూన్
  • ఆవాలు - సగం టేబుల్ స్పూన్
  • ఇంగువ - చిటికెడు

సంక్రాంతి మటన్ ముక్క సరిగా ఉడకట్లేదా? - ఇలా చేస్తే మెత్తగా ఉడికిపోద్ది!

తయారు చేసుకునే విధానం

  • నాటు కోడి ఐదు లేదా ఆరు ముక్కలు తీసుకుని రోకలిలో వేసుకుని నాలుగైదు సార్లు మెల్లిగా దంచుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చారు పొడి కోసం మిరియాలు, జీల కర్ర, ధనియాలు, మెంతులు, కందిపప్పు దోరగా వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి.
  • బాగా పండిన టమాటాలు తీసుకున్నారు కదా. ఇప్పుడు వాటిని నాలుగైదు ముక్కలు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కొత్తిమీర (కాడలతో ఉన్నది) వేసుకుని బాగా చిదమాలి.
  • అలా చిదిమితే మెత్తగా పేస్ట్​లాగా అవుతుంది. అందులో ఇప్పుడు నాన బెట్టుకున్న చింతపండును వేసి చిదుముతూ సారాన్ని తీసుకోవాలి. అలా చిక్కగా ఉన్న రసాన్ని పక్కకి తీసుకోవాలి.
  • ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. దంచి పెట్టుకున్న చికెన్​ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • ముక్కలు వేగిన తర్వాత తీసిపెట్టుకున్న టమాటా సారాన్ని అందులో పోసుకుని, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు వేసుకోవాలి.
  • పచ్చిమిర్చి చీలికలు మెత్తగా వేగే వరకు మరిగించుకోవాలి. పచ్చి మిర్చి మెత్తగా అయ్యాక, ఇప్పుడు చేసి పెట్టుకున్న పప్పు పొడిని చారులో వేసుకుని కాసేపు మరిగించుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత జీల కర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకుని వేయించాలి.
  • ఈ తాలింపును మరుగుతున్న రసంలో వేసుకుని, తరిగిన కొత్తీమిర తురుములు యాడ్ చేసుకుని మరింగించుకోవాలి. కాసేపయ్యాక దింపుకుంటే సరిపోతుంది. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ నాటుకోడి రసాన్ని వాఁ.. అంటూ తినేస్తారు.

ఈ 3 రోజులు ఇలా చేస్తే - ఈ సంక్రాంతి జీవితాంతం గుర్తుండిపోతుంది!

ఈసారి భోగి ఎంతో ప్రత్యేకం - 110 ఏళ్లకు ఒకసారి ఇలా! - మంటల్లో ఇవి దహనం చేసేద్దాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.