సెప్టెంబర్ 15న ఏపీలోని గోదావరి నదిలో పడవ బోల్తా ఘటనలో మృతిచెందిన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ వాసుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బాధిత కుటుంబీకులకు చెక్కులు అందించారు. గ్రామానికి చెందిన 15 మంది విహరయాత్రకు వెళ్లగా 9మంది మృత్యవాతపడ్డారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10లక్షలు, తెలంగాణ సర్కారు రూ.5లక్షలు పరిహారం ప్రకటించగా..... వాటితో పాటు లేబర్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి అదనంగా రూ.6లక్షల 30వేల రూపాయలు అందించారు. మొత్తంగా తొమ్మిది మంది బాధిత కుటుంబాలకు కోటి, 66లక్షల, 50వేల విలువైన చెక్కులు అందించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ