దాతల సహకారంతో సమకూర్చిన కూరగాయలను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం 35వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలో నివాసముంటున్న పేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 400 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కూరగాయలు వారికి అందజేశారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొవిడ్-19 కట్టడికి చేపట్టిన లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ రవీంద్ర కుమార్, కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డీజీపీ నేతృత్వంలో నిత్యావసర సరకుల రవాణా