ఓరుగల్లు నగరం ఎన్నికల ప్రచారాలతో మారుమోగుతోంది. 15వ డివిజన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి మనోహర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొన్ని పార్టీలు ప్రజల్లో చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె డప్పు కొడుతూ ప్రచారాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: 'గిట్టుబాటు ధరలే లేవంటే... ఈ కమీషన్ ఏజెంట్ల మోత ఒకటి'