మిషన్ భగీరథ పథకం కోసం ఒక్క వరంగల్ నగరానికే రూ. 1,000 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఉగాది నుంచి ఇంటింటికీ తాగునీరందిస్తామని వారు పేర్కొన్నారు. ఈనెల 12న వరంగల్లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. పర్యటించనున్నారు.
కేటీఆర్ పర్యటనపై, నగరాభివృద్ధి పనులపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సమీక్షించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు.
ఇంటింటికీ తాగునీరందించే మిషన్ భగీరథ పథకం, రెండు పడకల గదుల ఇళ్లు, నిరుపేదలకు పట్టాల పంపిణీ, వైకుంఠధామాలు, వరద కాల్వలు, వరంగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి తదితర కార్యక్రమాలకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని వివరించారు.