వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లంద గ్రామంలోని కంఠమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే రమేశ్‌తో కలసి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు. బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి సంఘటితం శక్తితో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నలు దిశలా వ్యాపింపజేసిన గొప్ప వీరుడని కొనియాడారు. ఈ సందర్బంగా పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రమేశ్ తాటి మొక్కను నాటి సర్వాయి పాపన్నకు అంకితం చేశారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!