ETV Bharat / state

ఎంజీఎంలో కొవిడ్​ రోగులకు మెరుగైన వైద్యం: మంత్రి ఎర్రబెల్లి - ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ఎర్రబెల్లి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్​ ఆస్పత్రిగా మార్చామని వెల్లడించారు.

తెలంగాణ వార్తలు
Warangal news
author img

By

Published : May 6, 2021, 10:28 PM IST

కొవిడ్​ ఉద్ధృతి కారణంగా ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయి కొవిడ్​ ఆస్పత్రిగా మార్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. ఆస్పత్రిలో 800 పడకలు ఉన్నాయని... వాటిలో 650 పడకల వరకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్​ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది చివరి నిమిషంలో ఎంజీఎంకి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

కొవిడ్​ కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని... అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని మంత్రి సూచించారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో అమెజాన్​ సంస్థ అందజేసిన 25 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​ను.. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.