లాక్డౌన్ కారణంగా నిరుపేదలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ చౌరస్తాలో అన్నపూర్ణ ఉచిత అన్నదాన క్యాంటీన్‌ని ఆమె ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో మొత్తం 9 ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులు, ఇంటింటికీ సర్వే చేస్తున్న ఆశా వర్కర్లు కూడా ఈ కేంద్రాల్లో అందించే ఉచిత భోజన సదుపాయాన్ని వినియోగించుకోవాలని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతీ రోజు 9 నుంచి 10 వేల మందికి ఉచితంగా భోజనాన్ని అందించేందుకు ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాజీపేట్, కేయూసి, ఎంజీఎం, ఎనుమాముల మార్కెట్, మెటర్నిటీ ఆసుపత్రి, అండర్ బ్రిడ్జి మొదలగు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు