మాస్క్‌పై అవగాహన కల్పించేందుకు వరంగల్ నగరపాలక సంస్థ విన్నూత్న ఆలోచన చేసింది. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మాస్క్ మ్యాన్ బొమ్మను ఏర్పాటు చేసింది. మాస్క్ ప్రాధాన్యం తెలిపేలా సందేశాలను ముద్రించింది.
ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు మాస్క్ మ్యాన్ విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరైనా పొరపాటున మాస్క్ అజాగ్రత్తగా ధరిస్తే వెంటనే సరిచేసుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి బొమ్మలు ఏర్పాటు చేస్తే మరింత అవగాహన కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ఇదీ చూడండి: CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!