వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంతిని వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
రహదారి మధ్యలో లారీ పడిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటన అర్ధరాత్రి జరగడం వల్ల వాహనాన్ని తొలగించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దాదాపు 3 గంటల తర్వాత జేసీబీ సహాయంతో రోడ్డు పైనుంచి వాహనాన్ని తొలగించారు.