వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ బాలసదనంలో 10 సంవత్సరాలలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శనివారం సాయంత్రం వారు ఆశ్రమంలో లేనట్లు నిర్వాహకులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు.
చిన్నారుల ఫోటోతో గాలింపు చర్యలు చేపట్టగా... మంచిర్యాల రైల్వేస్టేషన్లో వారిని గుర్తించారు. చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవీ చూడండి: చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువే!