కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనడమే కాకుండా రాష్ట్ర అంతర్గత భద్రత, ప్రజల సంక్షేమానికి టీఎస్ఎస్పీ సిబ్బంది అందిస్తున్న సేవలు అందరికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ అన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులోని టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ ప్రాంగణంలోని 5వ బెటాలియన్‌కు కేటాయించిన పరిపాలనా భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఐదో బెటాలియన్ కమాండెంట్ ఛటర్జీ, నాలుగో బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ వెంకటయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ భవనం మరో పదిహేను ఏళ్ల వరకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఛటర్జీ పేర్కొన్నారు. రెండేళ్లలోపు అన్నిరకాల సౌకర్యాలతో బెటాలియన్ సిద్ధమవుతోందని తెలిపారు. అప్పటి వరకు వరంగల్ నుంచే బెటాలియన్ సేవలు అందనున్నాయని వివరించారు.
- ఇదీ చూడండి: మధ్యాహ్నం తెలంగాణకు కొవిషీల్డ్ టీకా డోసులు