ETV Bharat / state

ఈ-ఎఫ్‌ఎమ్‌కు బెస్ట్ న్యూలాంచ్‌ ఎఫ్‌ఎమ్‌ స్టేషన్‌ పురస్కారం

author img

By

Published : Jun 1, 2019, 7:52 PM IST

ఎఫ్ఎం రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే రామోజీ గ్రూపు సంస్థ... ఈనాడు ఎఫ్ఎం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు ఇండియన్‌ రేడియో ఫోరమ్‌ - ఐ.ఆర్.ఎఫ్ పురస్కారాలు ఇస్తుంటుంది. ఆకట్టుకునే కార్యక్రమాలు, వాణిజ్య విలువలు, ప్రతిభకు ప్రోత్సాహం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ విభాగాల్లో ఉన్నత విలువలు పాటించినందుకు ఈ ఎఫ్ఎంకు ఐఆర్ఎఫ్ పురస్కారం దక్కింది.

ఈ-ఎఫ్‌ఎమ్‌
ఈ-ఎఫ్‌ఎమ్‌

మెట్రోపాలిటన్‌ ప్రజలకు ఎప్పటినుంచో పరిచయమైన ఎఫ్ఎం రేడియో సేవలను... ద్వితీయ శ్రేణి నగరాలకూ అందించే ఉద్దేశంతో... గత ఏడాది జులైలో ఈనాడు ఎఫ్ఎం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో... వరంగల్‌, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతిలో ఎఫ్‌ఎమ్‌ స్టేషన్లు నెలకొల్పింది. పెద్దలు మెచ్చే జానపదాలు, యువతను ఉర్రూతలూగించే పాటలు, కార్యక్రమాలతో శ్రోతలకు చేరువైంది. ఎఫ్‌ఎమ్‌ స్టేషన్‌ ప్రారంభించి ఏడాది కాకముందే.... ఐ.ఆర్.ఎఫ్.. బెస్ట్‌ న్యూలాంచ్‌ ఎఫ్ఎం స్టేషన్‌ సిల్వర్‌ అవార్డును సొంతం చేసుకుని.... జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రోతలకే అవార్డును అంకితమిస్తున్నామని ఈ-ఎఫ్ఎం పేర్కొంది.

మిగిలిన స్టేషన్లతో పోలిస్తే... విభిన్నమైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఈ-ఎఫ్ఎం శ్రోతలను అలరిస్తోంది. చర్చా వేదికలు, సంగీత అభిమానులకు ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం సూచనలు, ఆంధ్ర అత్త - తెలంగాణ కోడలు వంటి కార్యక్రమాలు రూపొందించింది. తమ కార్యక్రమాలకు శ్రోతల నుంచి వచ్చే స్పందన సంతృప్తినిస్తోందని... తమ ఎఫ్ఎం అన్నంతగా వాళ్లు తమతో మాట్లాడతారని ఆర్.జే లు చెప్పారు. ఈ పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని.... శ్రోతలకు ఇంకా దగ్గరయ్యేందుకు... విభిన్న కార్యక్రమాలు రూపొందిస్తామని ఈఎఫ్ఎం తెలిపింది.

ఇవీ చూడండి: అదృశ్యమైన బాలుర మృతదేహాలు చెక్కపెట్టెలో లభ్యం

Intro:FILE NAME : AP_ONG_41_01_GOVT_HASPATAL_LO_DRINKING_WATER_IBBANDULU_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు వంద పడకల ఉన్న ఆసుపత్రికి అవుట్ పేషెంట్ విభాగానికి రోజు వందలాది మందులు రోగులు వైద్య సాయం కోసం వస్తున్నారు భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు పట్టణంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలుదాతలు అక్కడ అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి కి దాతలు సహృదయంతో స్పందించి మంచినీటి ఇ శుద్ధ జల కేంద్రాన్ని అందించారు అయినా ఆస్పత్రి ఇ సిబ్బంది నిర్లక్ష్యంతో అది మనుగడ లేకుండా పోయింది నిత్యం వస్తున్న రోగులు నీళ్లు పట్టుకుందామని వెళ్లి నీళ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బయటి నుండి డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి దాపురించింది. దాతలు సహృదయంతో ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా మూల పడేశారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా స్పందించి చి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని రోగులు కోరుతున్నారు.

Body:బైట్ : బెజ్జం విజయ్ కుమార్ - ప్రజా సంఘాల నాయకుడు.చీరాల.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :, 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.