వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ, కాజీపేట్ ప్రాంతాల్లో హోలీ సంబురాలు పాక్షికంగానే కనబడుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో వేడుకలు తగ్గుముఖం పట్టాయి.
కొన్ని చోట్ల చిన్నారులు అడపాదడపా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. వారికి ఎలాంటి హానీ కలగకుండా పర్యావరణహితంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకున్నారు. పసుపు వంటి సహజసిద్ధమైన రంగులనే పూసుకుంటూ పండుగను జరుపుకున్నారు.
ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'