Hanamkonda Bus Stand : వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు ఉండటం సాధారణం. ప్రజలు ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో సమస్యలుంటే అధికారులు వాటిని బాగు చేసేస్తారు. మరీ రద్దీ ప్రదేశాల్లో అయితే రోజుల వ్యవధిలోనే రోడ్లను, ప్రదేశాలను బాగు చేయిస్తారు. కానీ ఈ నగరాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా ఈ నగరానికి చారిత్రక ప్రదేశంగా పేరు, రోజుకు ఇక్కడ వేలమంది ప్రయాణిస్తుంటారు. బాగు చేయించకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ, ప్రజలు మాత్రం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు.
hanamkonda Bus Stand Road Damage : వర్షం వస్తే.. హనుమకొండ ప్రయాణికుల ప్రాంగణం.. చెరువులా మారుతోంది. నీళ్లలోంచి వెళ్లలేక.. జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో.. పలువురు నీళ్లలో పడి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఎవరికేం జరిగినా... బస్టాండ్ తీరు మాత్రం మారట్లేదు. హైదరాబాద్ తరువాత.. అంతటి ప్రఖ్యాతి గాంచిన నగరం .. హనుమకొండ. కానీ అక్కడ ఉన్న బస్టాండ్ పరిస్ధితి మాత్రం దయనీయంగా మారుతోంది. వర్షం వస్తే చాలు బస్టాండ్ పరిసరాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. చెరువును తలపించే విధంగా.. ప్రయాణ ప్రాంగణం మారిపోతోంది. నీళ్లలోంచే.. ప్రయాణికులు వెళ్తూ.. నానా అగచాట్లు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఏ గుంత ఉందో అని ప్రజలు భయాందోళనరు గురవుతున్నారు.
"బస్‌స్టాండ్‌లో చాలా నీరు వచ్చింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరంగల్‌లో హనుమకొండ అంటే ఎంత బాగుండాలి కానీ ఒక్క వర్షానికే బస్‌స్టాండ్‌లోకి అంతా నీరు చేరిపోయింది. చాలా ఇబ్బంది కరంగా ఉంది." - స్థానికుడు
hanamkonda Bus Stand issues : హనుమకొండ ప్రయాణికుల ప్రాంగణం.. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. చారిత్రక నగరం కావడంతో.. పర్యాటక ప్రదేశం అవ్వడంతో ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. నిత్యం లక్షమంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 900పైన ఆర్టీసీ సర్వీసులు తిరుగుతాయి. నగరంలోనే ఉన్నా.. బస్టాండ్ మాత్రం.. పలెట్లూర్లో ఉందా అన్న రీతిలో కనిపిస్తోంది. వర్షం వస్తే.. బస్టాండ్‌లోకి నీళ్లు వచ్చి ప్రయాణికులు నరకం చవి చూస్తున్నారు. నీళ్లలోంచి వెళ్లే క్రమంలో జారిపడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు
"చాలా ఇబ్బందిగా ఉంది. మా అమ్మ అయితే జారి పడేది. ప్రతి సంవత్సరం ఇదే సమస్య. నేను ఇది చూడబట్టి 5,6 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం స్పందించి బస్టాండ్‌లో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటున్నాను." - స్థానికురాలు.
బస్టాండ్ పరిసరాల్లోనూ.. రహదారులపైనా నీళ్లు నిలిచి... ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. డ్రైనేజీ నీరు... వర్షపు నీరు కలసి.. రోడ్లపైకి వచ్చేస్తుండడంతో.. సమీపంలోని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పటికప్పుడు నీళ్లు తొలగించే పని కూడా అధికారులు చేపట్టేట్లేదని వాపోతున్నారు. నిధుల కొరత లేకున్నా.. కేవలం అధికారులు నిర్లక్ష్యం కారణంగా.. హన్మకొండ బస్టాండ్ బరుదమయంగా మారిపోతుంది. ఇప్పటికైనా తమ మొర ఆలకించి ప్రాంగణాన్ని బాగు చేయాలని.. ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: