ETV Bharat / state

'మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

author img

By

Published : Feb 5, 2021, 8:07 PM IST

Updated : Feb 6, 2021, 9:29 AM IST

మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్​భాస్కర్ తెలిపారు. ముస్లింల దహన సంస్కారాల కోసం నిర్మించిన గుసుల్ ఖానాను ఆయన ప్రారంభించారు.

gusul-khana-open-by-chip-vip-mla-vinay-bhaskar-at-warangal
'మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది'

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గా సమీపంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రూ. 55 లక్షలతో నిర్మించిన గుసుల్ ఖానా (అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం)ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు. సొంత ఇల్లు లేని మైనార్టీలు అంత్యక్రియ సమయంలో పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గుసుల్ ఖానాను ప్రారంభించామని ఆయన తెలిపారు.

మృతదేహానికి ముస్లిం సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేక గదులు నిర్మించి నీటి వసతి కల్పించామన్నారు. అద్దె ఇళ్లలో ఉండే వారు చనిపోతే యజమానులు ఇంట్లోకి మృతదేహాన్ని నిరాకరించడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వీటి నిర్మాణం మొదలుపెట్టిందని.. నగరంలో మరీన్ని చోట్ల వీటిని నిర్మిస్తామని వినయ్​భాస్కర్ తెలిపారు.

ఇదీ చూడండి: 'రేపటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​'

Last Updated : Feb 6, 2021, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.