ETV Bharat / state

గ్రేటర్​ వరంగల్ ఎన్నికల​ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : May 1, 2021, 10:24 PM IST

గ్రేటర్​ వరంగల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 3న జరగనుంది. లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

gwmc elections
గ్రేటర్​ వరంగల్ ఎన్నికల​ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి

సోమవారం జరిగే గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ... వార్డులను మొత్తం 3 బ్లాకులుగా చేసి లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మొత్తం 2వేలమంది అధికారులు సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి వార్డుకూ 2 బల్లలు, ఇద్దరు కౌంటింగ్ సిబ్బంది, ఒక సూపర్​వైజర్​, ఆర్వో, ఏఆర్వోలు ఉండి ఓట్ల లెక్కింపు చేస్తారు.

ప్రతి రౌండ్​లో బల్లకు వేయి ఓట్ల చోప్పున రెండు వేల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఇటు ఓట్ల లెక్కింపు కేంద్రంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపాయి. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ ఉంటుందని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని వరంగల్ సీపీ తరుణ్ జోషి చెప్పారు.

ఇదీ చదవండి: రేపే నాగార్జున సాగర్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు... ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.