ETV Bharat / state

గ్రేటర్ వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్​.. మేయర్​ సమీక్ష - గ్రేటర్ వరంగల్ నగర మేయర్ ప్రకాశ్​రావు

హైదరాబాద్​లోని మంత్రుల అధికారిక నివాసంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ ప్రకాశ్​రావు, వినోద్ కుమార్​తో ప్రత్యేకంగా సమీక్షించారు. గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్​ను సత్వరమే సీఎం కేసీఆర్​చే ఆమోద ముద్ర వేయించాల్సిన ఆవశ్యకతపై సమీక్షలో ప్రధానంగా ప్రస్తావించారు.

Greater Warangal 2041 Master Plan Mayor prakash Review meeting with vinodkumar
గ్రేటర్ వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్​.. మేయర్​ సమీక్ష
author img

By

Published : Sep 16, 2020, 9:37 AM IST

గ్రేటర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ గుండా ప్రకాశ్​రావుతో కలిసి సమీక్షించారు. హైదరాబాద్​లోని మంత్రుల అధికారిక నివాసంలో మేయర్ ప్రకాశ్​రావు, వినోద్ కుమార్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ సహా నగర తక్షణ అవసరాలపై వినోద్ కుమార్ దృష్టి సారించారు.

వరంగల్ నగరానికి చెందిన పలు అంశాలను మేయర్ ప్రకాశ్​రావు నివేదించారు. ప్రస్తుత జనాభా అవసరాలతోపాటు రాబోయే 2041 వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్​ను సత్వరమే సీఎం కేసీఆర్​చే ఆమోద ముద్ర వేయించాల్సిన ఆవశ్యకతపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. వరంగల్ నగర స్వరూపంపై సంపూర్ణ అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ విషయంలో తనదైన ముద్ర వేయనున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : శ్రీరాం సాగర్​కు వరద పోటు.. 40 గేట్లు ఎత్తి నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.