వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను రైతు సంఘం నాయకులు సందర్శించి ఆందోళన చేపట్టారు. మిర్చి యార్డులో కలియతిరుగుతూ మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీని రైతులను అడిగి తెలుసుకున్నారు.
గత వారం 20వేలు పలికిన మిర్చి ధర ఒక్కసారిగా పదివేలకు పడిపోవడానికి గల కారణాలు అధికారులతో చర్చించారు. వ్యాపారులు కావాలనే ధరలను నియంత్రించారని వారు ఆరోపించారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం