వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈనాడు చేపట్టిన ఈ క్రీడలను యువత చక్కగా వినియోగించుకుంటూ.. తమ సత్తా చాటుతున్నారు.
కళాశాలల మధ్య జరుగుతోన్న ఈ క్రీడాపోటీలు అంతర్జాతీయ మ్యాచ్‌లను తలపిస్తున్నాయి. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతుండడం వల్ల మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి.
ఇదీ చూడండి : అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి