Covid in kakatiya medical college: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో 17 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వైద్య విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 17 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా.. మరికొందరు హాస్టల్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.
మరో 90 మందిని పరీక్షించగా.. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శుక్ర, శని రెండు రోజుల్లో హనుమకొండలో 99, మహబూబాబాద్‌లో 75 కేసులు నమోదైయ్యాయి.
ఇదీ చదవండి: