ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. అందుకే ప్రతి సంవత్సరం రూ. 300 కోట్ల నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రతి ఆదివారం నిర్వహించే కాలనీ దర్శిని కార్యక్రమంలో భాగంగా వడ్డేపల్లి, టీచర్స్ కాలనీలను ఆయన సందర్శించారు.
గత కొన్ని రోజులు క్రితం కురిసిన వర్షానికి దెబ్బతిన్న కాలనీ రహదారులను పరిశీలించారు. దశల వారిగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: త్వరలో మరో రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభిస్తాం: కేటీఆర్