వెబ్సైట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు విశ్వవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ పేర్కొన్నారు. జిల్లాలోని 24 ప్రభుత్వ పాఠశాలలకు వెబ్ ద్వారా విద్యార్థులకు బోధన అందించే వెబ్సైట్లను ఆయన ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ ద్వారా డిజిటల్ తరగతుల కోసం స్వయంగా ఉపాధ్యాయులు తయారు చేసిన 75 వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు.
వెబ్సైట్లో కావాల్సిన పాఠ్య పుస్తకాలతోపాటు అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు చెప్పారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టేట్ సిలబస్‌ను అనుసరించి 75 పాఠాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల విద్యార్థులు చూసుకునే వెసులుబాటు ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్