వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారితో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. పాలనాధికారి అందుబాటులో లేనందున ఆర్డీవో వెంకారెడ్డి, మెప్మా పీడీ కృష్ణవేణి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లు, భూ సమస్యలకు సంబంధిన అంశాలపై ఎక్కవ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః '2030 నాటికి 260 లక్షల హెక్టార్ల ఎడారికి హరిత శోభ'